: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు పయనమైన తొలి రష్యన్ మహిళ


ఐఎన్ఎస్ (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) కు తొలి రష్యన్ మహిళ పయనమైంది. ఈ రోజు కజకస్థాన్ లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ముగ్గురు రష్యన్ వ్యోమగాములు ఐఎన్ఎస్ కు బయలుదేరారు. వీరిలో 38 ఏళ్ల సెరోవా అనే మహిళా వ్యోమగామి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఐఎన్ఎస్ లో పనిచేసిన తొలి రష్యన్ మహిళగా సెరోవా చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నారు. అంతరిక్ష యాత్ర చేయడానికి సెరోవా ఏడేళ్ల పాటు కఠోర శిక్షణ పొందారు. అయితే, అంతరిక్షయానం చేసిన తొలి మహిళగా రష్యాకు చెందిన వాలెంటినా తెరెష్కోవా (1963లో) చరిత్ర సృష్టించారు.

  • Loading...

More Telugu News