: ఢిల్లీలో నేటి నుంచి 'లెస్బియన్ ఫిల్మ్ ఫెస్టివల్'
ఢిల్లీ యూనివర్శిటీలో ఈరోజు 'లెస్బియన్ ఫిల్మ్ ఫెస్టివల్' ప్రారంభమైంది. యూనివర్శిటీ జెండర్ స్టడీస్ గ్రూప్ నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ నేడు, రేపు జరుగుతుంది. దీనికి ఎంట్రీ ఫీజు లేదు. విశ్వవిద్యాలయంలోని పొలిటికల్ సైన్స్ విభాగంలో ఈ వేడుకలు మొదలయ్యాయి. స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్ నటించిన 'సుబా' చిత్ర ప్రదర్శనతో దీనికి శ్రీకారం చుట్టారు. అటు దీపా మెహతా దర్శకత్వం వహించగా, నందితా దాస్, షబానా అజ్మ నటించిన వివాదాస్పద సినిమా 'ఫైర్'ను రేపు ప్రదర్శించనున్నారు. కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలు చిత్రాలు, డాక్యుమెంటరీలు కూడా ఈరోజు, రేపు ప్రదర్శిస్తారు. అటు సినిమాల్లో లెస్బియన్ ప్రాతినిధ్యంపై విద్యార్థి ప్యానెల్ రేపు చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.