: యూఎన్ సదస్సులో కాశ్మీర్ అంశాన్ని షరీఫ్ ప్రస్తావిస్తారు: పాకిస్థాన్


కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన ప్రసంగంలో లేవనెత్తుతారని ఆ దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి ఎజాజ్ అహ్మద్ చౌదురి తెలిపారు. ఆ అంశాన్ని లేవనెత్తకుండా ఉండేందుకు తమకు కారణమేమీ కనిపించడం లేదన్నారు. ఈ మేరకు పీఎం షరీఫ్ తో పాటు న్యూయార్క్ చేరుకున్న ఎజాజ్ మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్ సమస్య పరిష్కరానికి ఇప్పటికీ ఫ్లెబిసైట్ ఒక్కటే పరిష్కార మార్గమని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ సమయంలో భారత్, పాక్ చర్చల రద్దుపై స్పందించిన కార్యదర్శి, మళ్లీ చర్చలు జరపాలనుకుంటే భారతే చొరవ చూపాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News