: వరంగల్ అమ్మాయికి గూగుల్ స్కాలర్ షిప్
మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న వరంగల్ కు చెందిన బబ్బుల స్పందనరాజ్ అనే విద్యార్థిని గూగుల్ స్కాలర్ షిప్ కు ఎంపికయింది. ఆసియా పసిఫిక్ దేశాల్లోని గూగుల్ సంస్థ ప్రతిష్ఠాత్మక 'గూగుల్ అనిత బోర్గ్ స్మారక ఉపకార వేతనం'ను ఆమెకు ఇవ్వనుంది. మొత్తం ఎనిమిది దేశాల నుంచి 27 మంది విద్యార్థులను గూగుల్ ఎంపిక చేయగా, అందులో ఏడుగురు భారతీయులు ఉండటం విశేషం. వారిలో స్పందన ఒక్కతే తెలుగు అమ్మాయి. దాంతో పాటు ఫేస్ బుక్ 2014 గ్రేన్ హాప్పర్ స్కాలర్ షిప్ కు కూడా స్పందన సెలక్ట్ అయింది. వచ్చే నెల ఫినిక్స్ లో జరిగే ఫేస్ బుక్ సదస్సులో ఆమె పాల్గొంటుంది. ఈ సదస్సుకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల హాజరవుతారు.