: ఆసియా క్రీడల నుంచి నిష్క్రమించిన కశ్యప్


కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ ఆసియా క్రీడల్లో నిరాశపరిచాడు. దక్షిణకొరియా నగరం ఇంచియాన్ లో శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్స్ లో కశ్యప్ 12-21, 11-21తో వరల్డ్ నెంబర్ వన్ లీ చాంగ్ వీ చేతిలో ఓటమి చవిచూశాడు. మలేసియా టాప్ షట్లర్ చాంగ్ వీతో పోరులో కశ్యప్ అనేక పొరపాట్లు చేసి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. కోచ్ గోపీచంద్ పదేపదే హెచ్చరిస్తున్నా కశ్యప్ ఆటతీరులో మార్పు కనిపించలేదు. అటు, లీ చాంగ్ వీ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబర్చాడు. అటు, మిక్స్ డ్ డబుల్స్ లోనూ భారత్ కు నిరాశ తప్పలేదు. సుమీత్ రెడ్డి, మను అత్రి జోడీ క్వార్టర్ ఫైనల్లో 18-21, 23-21, 15-21తో సింగపూర్ జోడీ డానీ బవా క్రిస్నాంతా, యు యాన్ వనెస్సా నియో చేతిలో పరాజయంపాలైంది.

  • Loading...

More Telugu News