: 'ఎన్ కన్వెన్షన్' తుమ్మిడికుంట చెరువు వద్ద రీసర్వే మొదలు
హైదరాబాదు మాదాపూర్ లోని నటుడు నాగార్జునకు చెందిన 'ఎన్ కన్వెన్షన్' వద్ద తుమ్మిడికుంట చెరువు రీసర్వే మొదలైంది. జీహెచ్ఎంసీ, సాగునీటి పారుదలశాఖ, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం వరకు హద్దులు నిర్ధారిస్తున్నారు. చెరువు స్థలంలోని కొంతభాగాన్ని ఆక్రమించి నాగ్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని గతంలో తేలింది. దాంతో, ఈరోజు రీసర్వే చేస్తున్నారు. సర్వే అనంతరం భూమి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని శేరిలింగంపల్లి తహసీల్దార్ విద్యాసాగర్ చెప్పారు.