: ముంబయి వీధుల్లో నటుడు రణ్ వీర్ సింగ్ నృత్యం!
ముంబయి రద్దీ వీధుల్లో బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ హల్ చల్ చేశాడు. అకస్మాత్తుగా 'క్రిష్' మాస్క్ లో కారు నుంచి దిగి రోడ్డుపైకి వచ్చి నృత్యం చేశాడు. ఆ సమయంలో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయి చూశారు. ఎవరా వ్యక్తి అని కొద్దిసేపు ఆలోచనలో పడ్డారు. తరువాత మాస్క్ తీసి 'ఐ లవ్ యూ హృతిక్' అని వెంటనే కారులో వెళ్లిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే... నటుడు హృతిక్ రోషన్ తాజాగా 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రంలో నటిస్తున్నాడు. 'బ్యాంగ్ బ్యాంగ్ డేర్' చేయండంటూ పలువురు నటులకు సవాల్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కారు నుంచి దిగి, ముంబయిలోని ఏదో ఒక వీధిలో నిలుచోవాలని... 'దీనికి అంగీకరిస్తావా?' అని రణ్ వీర్ ను హృతిక్ ట్విట్టర్ లో అడిగాడు.