: వరద బాధితులకు సంజయ్ దత్ సాయం


ముంబయి పేలుళ్ళ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కాశ్మీర్ వరద బాధితులకు సహాయపడాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు తాను శిక్ష అనుభవిస్తున్న పూణె యెరవాడ జైల్లోని ఖైదీలను బాధితులకు సాయపడాలని కోరాడు. సంజయ్ ప్రయత్నం ఫలితంగా ఖైదీలు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకువచ్చారు. అంతేగాకుండా, ఖైదీలు తమ శక్తిమేర సాయపడాలని కూడా సంజయ్ దత్ వారిని కోరినట్టు తెలుస్తోంది. ఖైదీల విరాళాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి పంపాలని సంజూ జైలు అధికారులకు విజ్ఞప్తి చేశాడు. కాగా, బాలీవుడ్ నుంచి ఇప్పటికే హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, శ్రద్ధా కపూర్, కునాల్ కపూర్ కాశ్మీర్ వరద బాధితులకు తమవంతు సాయం చేశారు.

  • Loading...

More Telugu News