: నాగార్జున ఎన్-కన్వెన్షన్ సెంటర్ లో నేడు సర్వే
హైదరాబాదులోని మాదాపూర్ వద్దనున్న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ లో ఈరోజు సర్వే జరగనుంది. శేరిలింగంపల్లి తహసీల్దార్ ఆధ్వర్యంలో మరికాసేపట్లో ఈ సర్వే నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వేలో పాల్గొని తుమ్మిడికుంట చెరువు ఎఫ్ టీఎల్ ను నిర్ధారిస్తారు. కాగా, గతంలోనే చెరువు భూమిలో 3.12 ఎకరాలు కబ్జా అయిందని తేల్చారు. మరోవైపు కొన్ని రోజుల కిందట నాగ్ కు తహసీల్దార్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.