: నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈ నిర్బంధం
అంతులేని విద్యుత్ కోతలతో తెలంగాణ రాష్ట్రం అల్లాడుతోంది. అడపాదడపా రైతన్నలు రోడెక్కి ధర్నాలు చేయడాన్ని చూస్తూనే ఉన్నాం. తాజాగా నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం దాన్ నగర్ విద్యుత్ ఉప కేంద్రంలో ఏఈని జనాలు నిర్బంధించారు. తమ తండాకు విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ ఏఈని బంధించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని గ్రామస్థులు తేల్చి చెప్పారు.