: సినీ దర్శకుడు లారెన్స్ పై చీటింగ్ కేసు నమోదు


సినీ దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్, అతని వ్యక్తిగత కార్యదర్శి రాజ్ కుమారై పై నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే... ప్రభాస్, తమన్నా జంటగా నటించిన 'రెబల్' సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నిర్మాణానికి ముందే, నిర్మాతలు, లారెన్స్ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. రూ. 23 కోట్లతో సినిమా నిర్మాణాన్ని పూర్తి చేస్తానని... అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే తానే భరిస్తానని లారెన్స్ హామీ ఇచ్చాడు. ఇదే విషయాన్ని అగ్రిమెంట్ రూపంలో కూడా రాసుకున్నారు. అయితే, ఈ సినిమా ఖర్చు అనుకున్న దానికంటే మరో రూ. 5 కోట్లు ఎక్కువ అయింది. దీంతో, ఆ డబ్బును ఇవ్వాలని నిర్మాతలు లారెన్స్ పై ఒత్తిడి తెచ్చారు. అయితే లారెన్స్ నుంచి వారికి మొండిచేయే ఎదురయింది. చివరకు లారెన్స్ నుంచి స్పందనలు కూడా కరవయ్యాయి. దీంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు లారెన్స్ పైన, అగ్రిమెంట్ సందర్భంలో మధ్యవర్తిగా వ్యవహరించిన లారెన్స్ పీఏ అయిన రాజ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, నిన్న వీరిద్దరిపై ఐపీసీ 406, 420 కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం లారెన్స్ కోసం గాలింపు మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News