: చర్చలకు పాక్ విఘాతం కలిగించింది: సుష్మా స్వరాజ్


కాశ్మీరీ వేర్పాటు వాదులైన హురియత్ నేతలతో ప్రత్యేక భేటీలు నిర్వహించిన పాకిస్తాన్, తమతో చర్చలకు విఘాతం కలిగించిందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ఇరుదేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలకు నాలుగు రోజులు ముందుగా పాక్, ఈ దుస్సాహసానికి పాల్పడిందని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘ఇరుదేశాల మధ్య సంబంధాల కోసం కొత్త ప్రభుత్వం కొత్త సంకేతాలనిచ్చింది. అయితే పాక్ ఆ సంకేతాలను పాడు చేసింది. మొత్తం గేమ్ నే పాడు చేసింది’’ అని ఐబీఎస్ఏ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ అనంతరం ఆమె చెప్పారు. ఇరుదేశాల మధ్య చర్చలకు భారత్ చొరవ చూపాలన్న పాక్ విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సుష్మా స్వరాజ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘‘ఎవరు ముందన్న విషయం అనవసరం. ప్రతిస్పందన ఉంటుందని పదేపదే చెప్పాం. ఇప్పటికీ మా ప్రతిపాదన అక్కడే ఉంది’’అని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News