: జపాన్ జాతీయ గీతాన్ని అవమానించిన చైనా స్విమ్మర్... పెను దుమారం


జపాన్ పై చైనీయులకు ఎంత ద్వేషం ఉందో ఈ ఘటన నిరూపిస్తుంది. ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ సందర్భంగా చైనా స్విమ్మర్ సున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పడు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. పురుషుల 4x100 ఫ్రీస్టయిల్ రిలేలో స్వర్ణ పతకం సాధించడంలో సున్ కీలకపాత్ర పోషించాడు. అనంతరం చైనా మీడియాతో మాట్లాడుతూ, జపాన్ జాతీయ గీతం వినడానికి చాలా అసహ్యంగా ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. జపాన్ తో పాటు అన్ని వైపుల నుంచి సున్ పై విమర్శల వర్షం కురుస్తోంది. డబుల్ ఒలింపిక్ ఛాంపియన్ అయిన సున్ ఇంత దిగజారి ఎలా మాట్లాడాడంటూ మండిపడుతున్నారు. మరో విషయం ఏమిటంటే... సున్ కు వివాదాలు కొత్త కాదు. పోయిన ఏడాది లైసెన్స్ లేకుండా కారు నడుపుతూ బస్ ను ఢీకొట్టాడు. ఈ వ్యవహారంలో అతన్ని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ ఘటనలో సున్ ఆరు నెలల పాటు నిషేధం ఎదుర్కొన్నాడు.

  • Loading...

More Telugu News