: 15 ఏళ్ల బంధం ముక్కలైంది: ఎన్సీపీ
మహారాష్ట్రలో బంధాలు ముక్కలవుతున్నాయి. శివసేన, బీజేపీ మధ్య 25 ఏళ్ల బంధం బద్దలైన కాసేపటికే, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య 15 ఏళ్ల బంధం ముక్కలైనట్టు ఎన్సీపీ ప్రకటించింది. మహారాష్ట్రలో ఎన్సీపీ బలం ఏంటో కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలని ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ అన్నారు. ఎన్సీపీ మద్దతు ఎప్పుడూ కాంగ్రెస్ కే ఉందని తెలిపిన ఆయన, తమ బంధం వీడినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తమకు స్నేహపూర్వక ప్రత్యర్థి అని తెలిపారు. ఎన్సీపీ కాంగ్రెస్ వెంట ఉన్న ప్రతిసారీ కాంగ్రెస్ పీఠం దక్కించుకుందని ఆయన వెల్లడించారు. తమ పార్టీ ఎన్నికల కోసం సర్వసన్నద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.