: వైఫైకి టెండర్లు పిలిచాం: కేటీఆర్
హైదరాబాదులో వైఫై ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచామని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాదులో నాస్కామ్ ప్రతినిధులతో సమావేశమైన సందర్భంలో ఆయన మాట్లాడుతూ, నాస్కామ్ వల్ల హైదరాబాదు ఇమేజ్ పెరిగిందని అన్నారు. హైదరాబాదులోని ఐటీ కారిడార్ లో పది రోజుల్లో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మహిళా రక్షణ కమిటీ ఇతర దేశాల్లో పర్యటించి నివేదిక ఇస్తుందని ఆయన తెలిపారు. ఐటీ పరిశ్రమపై వర్క్ షాప్ నిర్వహించి, మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. వరంగల్, కరీంనగర్ లలోనూ ఐటీ పరిశ్రమ అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.