: 'మామ్' విజయం భారత్ కే కాదు, ఆసియాకు కూడా గర్వకారణమే: చైనా


'మంగళ్యాన్' పేరిట అంగారక గ్రహంపైకి భారత్ ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతం కావడం పట్ల చైనా స్పందించింది. భారత అంతరిక్ష పరిశోధన పథంలో ఇదో మైలురాయి అని అభివర్ణించింది. 'మామ్' విజయంపై నివేదికను పరిశీలించామని, ఈ మేరకు భారత్ కు అభినందనలు తెలుపుతున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు. 'మామ్' విజయం భారత్ కే కాదని, ఆసియాకు కూడా గర్వకారణం అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News