: హత్యలు చేసి తాపీగా బిర్యానీ తిని పారిపోయారు


విజయవాడ-ఏలూరు హైవేపై కాల్పులు జరిపిన హంతకులు పకడ్బందీ ప్లాన్ ప్రకారం తమ పని తాము చేసుకుపోయారు. దుర్గారావు హత్యకేసు నిందితులు న్యాయస్థానానికి హాజరవుతారని సమాచారమున్న హంతకులు వారినెలా మట్టుబెట్టాలనే విషయాన్ని ప్లాన్ ప్రకారం అమలు చేశారు. సీసీ కెమెరాలు లేని హనుమాన్ జంక్షన్ ను ఎంచుకుని తమ ప్లాన్ పక్కాగా అమలు చేశారు. వాహనాలన్నీ హనుమాన్ జంక్షన్ లోనే అద్దెకు తీసుకున్నారు. విజయవాడ నుంచి హతులు వస్తున్న వాహనాన్ని వెంబడించిన హంతకులు తమను గమనించేంత దూరంలో రోడ్డుపై వాహనాలేవీ లేవని నిర్ధారించుకోగానే తమ పని చక్కబెట్టేశారు. అనంతరం గాభరా పడకుండా, ముందుగానే నిర్దేశించుకున్న ప్రకారం వారు బస చేసిన రాయల్ హంపి హోటల్ కి చేరుకున్నారు. అక్కడి రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డరిచ్చి తమ లగేజీ సర్దేశారు. సుష్ఠుగా బిర్యానీ తిన్న తరువాత ముందుగానే హనుమాన్ జంక్షన్ నుంచి విశాఖపట్టణానికి బేరమాడుకున్న రెండు కార్లలో బయలుదేరి రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర దిగిపోయి కార్లను వెనక్కి పంపించేశారు. ఇంతలో హంతకులు వాడిన వాహనాన్ని పోలీసులు గుర్తించడం, క్లూస్ టీం సేకరించిన అంశాలపై కూపీ లాగడం జరిగింది. హంతకుల్లో అయిదుగురు బీహార్ కు చెందిన వారు కాగా, ఒకరు మాత్రం స్థానికులని పోలీసులు వివరాలు సేకరించారు. వారు వాడిన కారు నెంబర్ పల్సర్ దిగా గుర్తించారు. ఆ పల్సర్ హతులు నిందితులుగా ఉన్న హత్యాకేసు ఫిర్యాదీదిగా నిర్ధారించారు. వారి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News