: ఆస్తుల కేసులో జయకు ఊరట లభించాలని పార్టీ నేత పూజలు
ముఖ్యమంత్రి జయలలిత రూ.66 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ నెల 27న (శనివారం) బెంగళూరు కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. పద్దెనిమిదేళ్ల నుంచి విచారణ కొనసాగుతున్న ఈ కేసులో తమ అధినేత్రికి ఊరట కలగాలని కోరుతూ ఏఐఏడీఎంకే నేత ఓం శక్తి శేఖర్, ఇంకా పలువురు కార్యకర్తలు ప్రత్యేక పూజలు జరిపారు. "మంచి, చెడు మధ్య జరుగుతున్న ఓ యుద్ధం ఇది. అందుకే మా అమ్మ (జయలలిత)కు విజయం కలగాలని ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం" అని పుదుచ్చేరికి చెందిన పార్టీ నేత ఒకరు చెప్పారు.