: అమెరికా బయలుదేరిన మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా బయలుదేరారు. ఐదు రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం ఆయన న్యూయార్క్ చేరుకుంటారు. ఈ నెల 27న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. పర్యటనలో భాగంగా ఈ నెల 29, 30 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో ఆయన భేటీ కానున్నారు. అంతేకాకుండా పలు దేశాధినేతలతో కూడా ఆయన సమావేశమవుతారు. వీటన్నిటికి తోడు ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ తో కూడా మోడీ వ్యక్తిగతంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై ఆయన చర్చించనున్నారు. ఈ నెల 30న మోడీ తన పర్యటన ముగించుకుని భారత్ తిరుగుపయనమవుతారు.