: 'స్వచ్ఛ్ భారత్' లోగోను ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
స్వచ్ఛ్ భారత్ లోగోను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేడు ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీ జయంతి (అక్టోబర్ 2న) రోజున దేశ వ్యాప్తంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. 2019 సెప్టెంబరులోగా స్వచ్ఛ్ భారత్ తన లక్ష్యాన్ని సాధిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం ప్రజల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించామని తెలిపారు.