: అచ్చం సినిమాలోలా దోచేశారు


అచ్చం సినిమాల్లోని సన్నివేశం తరహాలో దొంగలు దోచుకుపోయారు. వరంగల్ జిల్లా జేపీఎం రోడ్డులోని ఐసీఐసీఐ బ్యాంకులో మండిబజర్ ప్రాంతానికి చెందిన గుల్షన్ అనే వ్యక్తి 4.5 లక్షల రూపాయలను డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్నాడు. పార్కింగ్ ప్రాంతంలో ఉన్న తన బైక్ తీసుకునేందుకు ఆయన వచ్చేసరికి, అక్కడ పది రూపాయల నోట్లు పడి ఉన్నాయి. 10 రూపాయల నోట్లను గమనించిన, గుల్షన్ వాటిని తీసుకునేందుకు వంగగా, అదనుకోసం కాపుకాచిన దొంగలు అతని దగ్గరున్న నగదు బ్యాగ్ లాక్కుని పారిపోయారు. దీంతో విషయం అర్థం చేసుకున్న గుల్షన్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News