: 'మేక్ ఇన్ ఇండియా'కు పోటీగా 'మేడ్ ఇన్ చైనా'


కాకతాళీయమో లేక ఉద్దేశపూర్వకమో గానీ... సరిగ్గా ప్రధాని నరేంద్ర మోడీ 'మేక్ ఇన్ ఇండియా' ప్రచారం తెరపైకి తెచ్చాడో లేదో... అటు, చైనా ప్రభుత్వం 'మేడ్ ఇన్ చైనా' అంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున పన్ను మినహాయింపులు ఇచ్చేందుకు సిద్ధమైంది. సంస్థలు తమ ఉత్పాదన పెంచుకునేందుకు వీలుగా విదేశాల నుంచి నాణ్యమైన ఎక్విప్ మెంట్ తెచ్చుకోవడానికి, పరిశోధన-అభివృద్ధి రంగానికి ఊతమిచ్చేందుకే 'మేడ్ ఇన్ చైనా' విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు దిగుమతులపై పన్ను రాయితీ కల్పిస్తారు. విమానయాన, బయో మెడిసిన్, రైళ్ళు, ఓడల నిర్మాణం, ఎలక్ట్రానిక్స్ రంగాలకు కూడా ఈ వెసులుబాటు లభించనుంది.

  • Loading...

More Telugu News