: ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ కు నీటి పన్ను బకాయిపడ్డ సల్మాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఐఎంసీ) కు నీటి పన్ను బకాయిపడ్డాడు. దాంతో, బకాయి చెల్లించాలంటూ ఐఎంసీ అధికారులు నోటీసు పంపారట. అదేంటి సల్మాన్ పన్ను చెల్లించడం లేదా అని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే... ఇండోర్ లోని 4/2, ఓల్డ్ పాలసియాలో సల్లూ బంధువులు ఉంటున్నారు. దాంతో, వాళ్లు చెల్లించాల్సిన రూ. 6 వేలు గడువులోగా డిపాజిట్ చేయాలని, లేకుంటే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సల్మాన్ పేరు మీద నోటీసు ఇచ్చారు. అందులో సన్ ఆఫ్ సలీమ్ ఖాన్ అని కూడా నోటీసులో పేర్కొన్నారు. కాగా, ఐఎంసీ వెబ్ సైట్ లో, సల్మాన్ వాస్తవానికి రూ.23,929.50 నీటి పన్ను చెల్లించాలని, కానీ ఐఎంసీ పన్ను మాఫీ కింద రూ.17,274 మినహాయింపు ఇచ్చింది. కాబట్టి, సల్లూ రూ.5,990 చెల్లించాలి అని ఉంది. కాగా, ప్రస్తుతానికి సల్లూ నుంచి ఐఎంసీకి ఎలాంటి పేమెంట్ అందలేదు.