: 35 ఏళ్ల తర్వాత తమిళంలోకి డబ్ అయిన శంకరాభరణం


తెలుగు సినిమా చరిత్రలో శంకరాభరణం ఓ క్లాసిక్. 70వ దశకంలో కమర్షియల్ మూసలో సాగిపోతున్న తెలుగు సినిమాకు కొత్త నడక నేర్పిన కళాఖండం శంకరాభరణం. శంకరాభరణం విడుదలై ఇప్పటికి 35 సంవత్సరాలు దాటుతోంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత తమిళంలోకి డబ్ చేశారు. శంకరాభరణంలో పాటలు పాడి కీర్తిని సొంతం చేసుకున్న బాలసుబ్రహ్మణ్యం తమిళంలో శంకరశాస్త్రి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. తమిళంలోకి డబ్బింగ్ అంటే ఏదో ఆషామాషీగా చేయలేదు. ప్రస్తుత ట్రెండుకు తగ్గట్టుగా ఈ అపూర్వ చిత్ర రాజాన్ని డిజిటలైజ్ చేసి, సరికొత్త సౌండ్ ‌సిస్టమ్‌తో మ్యూజిక్‌ని టెక్నికల్ గా అప్‌గ్రేడ్ చేశారు. కలర్ కరెక్షన్ చేసి, అంతకుముందు 35 ఎంఎంలో వున్న సినిమాని సినిమా స్కోప్‌లోకి మార్చారు. రీ-రికార్డింగ్ కూడా కొత్త ఫార్మాట్‌లో చేశారు. సింపుల్ గా చెప్పాలంటే, నేటి సాంకేతిక అవసరాలకు తగినట్టుగా శంకరాభరణం సినిమాను తీర్చిదిద్దారు. తమిళ డబ్బింగ్ వర్షన్ అక్టోబర్ 2 న అక్కడ విడుదలవుతోంది. తెలుగు వర్షనే అప్పట్లో తమిళనాడులో కూడా సిల్వర్ జూబ్లీ ఆడింది. ఈ డిజిటల్ వర్షన్‌ని త్వరలో తెలుగులో కూడా విడుదల చేసే యోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News