: చంద్రబాబుపై అలిపిరి దాడి కేసులో ముగ్గురిని దోషులుగా తేల్చిన కోర్టు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తిరుమల అలిపిరి దాడి కేసులో ముగ్గురిని తిరుపతి అదనపు సహాయ జిల్లా కోర్టు దోషులుగా తేల్చింది. రామచంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, చంద్రలను బాంబు దాడి కేసులో కోర్టు దోషులుగా ప్రకటించింది. ఆధారాలు లేవంటూ ఇద్దిరిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. రెండో ఛార్జ్ షీటులో ఉన్న ముగ్గురిని దోషులుగా తేల్చింది. కాసేపట్లో ముగ్గురు దోషులకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. 2003 అక్టోబర్‌ 1న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద నక్సల్స్‌ బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే. సీఎం హోదాలో తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళుతుండగా చంద్రబాబుపై దాడి జరిగింది. ఈ కేసులో మొత్తం 33 మందిని నిందితులుగా చేర్చారు. 2011లో ఈ కేసుకు సంబంధించి తొలి తీర్పును న్యాయస్థానం వెలువరించింది. ఈ కేసు నిందితులు గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News