: 'వరల్డ్ కప్' కలలు కంటున్న సానియా భర్త


భారత టెన్నిస్ ఏస్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ వన్డే వరల్డ్ కప్ బెర్తుపై ఆశలు పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్ లో పాల్గొనే పాకిస్థాన్ జట్టులో తనకు చోటు లభిస్తుందని భావిస్తున్నాడు. దీనిపై మాట్లాడుతూ, "గత మూడు నాలుగేళ్ళుగా పాక్ జట్టుకు ఆడుతున్నాను. ఎన్నోసార్లు జట్టులోకి వచ్చిపోయాను... ఎంపిక చేస్తారు, కొన్నాళ్ళకే తీసేస్తారు!" అని వాపోయాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ పై దృష్టిపెట్టిన మాలిక్ దానికి ముందు కొంత అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని భావిస్తున్నాడు.

  • Loading...

More Telugu News