: 15 నెలల్లోగా మరో 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తాం: ప్రధానికి అంబానీ హామీ
ప్రధాని నరేంద్ర మోడీపై భారతీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ ప్రశంసల జల్లు కురిపించారు. నరేంద్రమోడీ కలలు కంటూ వాటిని సార్థకం చేసుకోవడానికి రోజుకు 14 గంటలు శ్రమిస్తున్నారని... ఇది కోట్లాది మంది భారతీయుల్లో స్పూర్తిని నింపుతోందని కొనియాడారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విధంగా స్పందించారు. దేశంలోనే అతిపెద్దదైన పారిశ్రామిక సంస్థ రిలయన్స్ నుంచి 165 దేశాలకు రూ. 2.65 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేస్తున్నామని ముఖేష్ చెప్పారు. రానున్న 12 నుంచి 15 నెలల్లో ఇండియాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నామని... తద్వారా 1.25 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని ప్రధానికి హామీ ఇచ్చారు. మంగళ్ యాన్ సక్సెస్ కావడం భారతదేశ గొప్పదనాన్ని చాటుతోందని... మామ్ ప్రయాణానికి కిలోమీటరుకు కేవలం రూ. 7 మాత్రమే ఖర్చయిందని... ఇది ప్రధాన నగరాల్లో ఆటో ప్రయాణం కన్నా చాలా చీప్ అని చెప్పారు.