: శాసనసభను సమావేశపరచాలని గవర్నర్ కు టి.టీడీపీ వినతి


తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. తక్షణమే శాసనసభను సమావేశపర్చాలని కోరారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలను చర్చించి ఈ క్రమంలో చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో మెట్రో భూముల వ్యవహారాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మెట్రో భూములను రాష్ట్రంలో ఏర్పాటుకానున్న గేమింగ్ సిటీకి ప్రభుత్వం అప్పనంగా కట్టబెడుతుందంటూ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రేవంత్ గవర్నర్ కు ఆ అంశంపై వివరించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు నేతలు వినతిపత్రం అందజేశారు.

  • Loading...

More Telugu News