: అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ ప్రథమార్థంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రి వర్గాన్ని అక్టోబర్ చివరి వారంలో కానీ లేదా నవంబర్ ప్రథమార్థంలో కానీ విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది, జూన్ రెండో తేదీన కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మరో 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం మరో ఆరుగురిని కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. గతంలో రెండుసార్లు మంత్రి వర్గాన్ని విస్తరిస్తానని కేసీఆర్ విలేకరుల సమావేశంలో చెప్పారు. అయితే, తాజాగా మెదక్ ఉపఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో విస్తరణ జరిపితే లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్లవుతుందిని కేసీీఆర్ దీన్ని ఆలస్యం చేస్తూ వస్తున్నారని సమాచారం. అయితే, ఇటీవలే పార్టీలో చేరిన ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రిపదవి హామీ ఇచ్చి టీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో, ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణను అక్టోబర్ నెలాఖరులో కానీ నవంబర్ ప్రథమార్థంలో కానీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News