: కేటీపీపీ ఎదుట స్థానికుల ధర్నా... వందల సంఖ్యలో నిలిచిపోయిన బొగ్గు లారీలు


వరంగల్ జిల్లాలో ఉన్న కేటీపీపీ (కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు) వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని దుబ్బపల్లి వాసులు ఈ తెల్లవారుజాము నుంచి ధర్నా చేపట్టారు. ప్రాజెక్టు నుంచి వెలువడే బూడిద తమ గ్రామంపై పడుతోందని... దీనివల్ల తాము అనారోగ్యాలకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల ధర్నాతో ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేసే వందలాది లారీలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్థంభించింది. ప్రస్తుతం కేటీపీపీ అధికారులు, పోలీసులు గ్రామస్థులతో చర్చలు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News