: హంతకులు పిస్టల్స్, హాకీ స్టిక్స్, ఇనుప రాడ్ ను ఉంచుకున్నారు


కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద అవుటుపల్లి వద్ద ఈ ఉదయం జరిగిన కాల్పుల్లో హంతకులు వాడిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హనుమాన్ జంక్షన్ లోని రాయల్ హంపి హోటల్ వెనుక పార్క్ చేసి ఉన్న కారును గుర్తించిన పోలీసులు కారుపై కూపీ లాగారు. కారులో క్లూల కోసం కారు అద్దాలను పగులగొట్టి సోదాలు జరిపారు. కారులో ఉన్న రెండు పిస్తోళ్లు, హాకీ స్టిక్, ఇనుపరాడ్ ను స్వాధీనం చేసుకున్నారు. హనుమాన్ జంక్షన్ లో సీసీ టీవీ కెమెరాలు లేకపోవడంతో హంతకుల ఆధారాలు లభ్యం కాలేదు. ఓ సూపర్ బజార్ లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ రికార్డయిన ఫూటేజిలో వారు సరిగా కనబడలేదని సమాచారం. దీంతో హంతకులు గత మూడు రోజులుగా రాయల్ హంపీ హోటల్లో బస చేసినట్టు తెలియడంతో వారు ఎప్పుడు? ఎక్కడెక్కడికి? ఎలా? వెళ్లారనే దానిపై విచారణ చేశారు. హత్య చేసిన తరువాత, విశాఖపట్టణం వెళ్తామని చెప్పి హంతకులు రెండు కార్లను అద్దెకు తీసుకున్నారు. అనంతరం వారు రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్దకు వచ్చాక కార్లకు డబ్బులిచ్చి దిగిపోయారు. దీంతో వారిని తరలించిన ప్రతి వాహనానికి సంబంధించిన డ్రైవర్లను ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News