: చర్లపల్లి జైలు హెడ్ వార్డర్, వార్డర్లు సస్పెండ్


చర్లపల్లి కేంద్ర కారాగారంలో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో ఖైదీల వద్ద సెల్ ఫోన్లు దొరకడంతో జైళ్ల శాఖాధికారులు చర్యలు తీసుకున్నారు. ఖైదీలు సెల్ ఫోన్లు వాడుతూ న్యాయవాదులను బెయిల్ కోసం సతాయిస్తుండడం, ఆ వైనం టీవీల్లో లైవ్ టెలీకాస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహించిన అధికారులు చర్లపల్లి జైలు హెడ్ వార్డర్ కరుణానిధి, వార్డర్లు జగదీష్, రవిలపై సస్పెన్షన్ వేటు వేశారు. వారు ముగ్గుర్ని విధుల నుంచి తప్పిస్తూ తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News