: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను తుడిచిపెట్టేస్తాం: ఒబామా


మధ్య ప్రాచ్యంలో పెను ఉపద్రవంగా మారిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను తుదముట్టిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఆయన ప్రసంగిస్తూ, ఉగ్రవాదులకు తెలిసింది బలప్రయోగం మాత్రమేనని అన్నారు. మిత్ర దేశాలతో కలిసి ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఆయన ప్రకటించారు. ఉగ్రవాదులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు. ఉగ్రవాద నిర్మూలనకు తమతో కలసి పని చేసేందుకు చాలా దేశాలు ఉత్సాహంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News