: యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ బాత్ రూమ్ లో వీడియో కెమెరా కలకలం
యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ బాత్ రూమ్ లో వీడియో కెమెరా కలకలం రేగింది. తమిళనాడులోని కంచి విశ్వవిద్యాలయంలోని లేడీస్ హాస్టల్ బాత్ రూమ్ లో వీడియో కెమెరా అమర్చిన విషయాన్ని గుర్తించిన విద్యార్థినులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు, రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. యూనివర్సిటీ ఎలక్ట్రీషియన్ ఈ పని చేసి ఉండవచ్చని యూనివర్సిటీ అధికారులు అనుమానిస్తున్నారు.