: కేసీఆర్ తన వారికి కట్టబెడుతున్నారు... ఇతరుల్ని హింస పెడుతున్నారు: రేవంత్ రెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు నచ్చిన వారికి భూములను కట్టబెడుతున్నారని, నచ్చని వారిపై కక్ష తీర్చుకుంటున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికలో రామేశ్వరరావుకు భూములు కేటాయించాలని ఎక్కడా పేర్కొనలేదని అన్నారు. రామేశ్వరరావు కేసీఆర్ కు సన్నిహితుడు కాబట్టే ఆయనకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించారని ఆయన ఆరోపించారు. రామేశ్వరరావుకు 26 కోట్ల రూపాయల స్టాంపు డ్యూటీ మినహాయింపునిచ్చారని ఆయన విమర్శించారు. ఈ అంశంలో ఏపీఐఐసీ కోరిన 3 కోట్ల 65 లక్షల రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పిందని రేవంత్ రెడ్డి తెలిపారు. రామేశ్వరరావు అడిగిన దానిపై క్షణాల్లో సంతకాలు పెడుతున్న సీఎం కేసీఆర్, అనుమతులు లేవని అయ్యప్ప సొసైటీలో ఐదంతస్తుల భవనాలను కూల్చేశారని అన్నారు.

  • Loading...

More Telugu News