: ఆదాయపన్ను కేసులో వ్యక్తిగత హాజరు నుంచి సీఎం జయకు ఊరట
ఆదాయ పన్ను కేసులో ముఖ్యమంత్రి జయలలితకు మద్రాసు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఈ కేసులో ఆమె కోర్టుకు హాజరుకావాల్సిన అవసరంలేదని కోర్టు తెలిపింది. ఇంతకుముందు అక్టోబర్ 1న జయ వ్యక్తిగతంగా కోర్టుకు రావాలంటూ ఆర్థిక నేరాల కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళ దాఖలు చేసిన ఉమ్మడి దరఖాస్తులకు సంబంధించి ఆరు వారాల్లోగా పని పూర్తి చేయాలని జస్టిస్ కేబికేవీ వాసుకి ఆదాయపన్ను శాఖను ఆదేశించారు. కాగా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఏడు నెలల గడువులోగా ఈ కేసు విచారణను పూర్తి చేయాలని చెప్పింది.