: హే 'మామ్', హౌ ఆర్ యూ... హౌ డు యూ డూ 'క్యూరియాసిటీ'... అరుణగ్రహంపై ముచ్చట్లు


హే 'మామ్' హౌ ఆర్ యూ... హౌ డు యూ డూ 'క్యూరియాసిటీ'... అంటూ రెండు ఉపగ్రహాలు ముచ్చటించుకున్నాయి. అప్పటికే అక్కడున్న క్యూరియాసిటీ రోవర్ కూడా వీటికి తోడయింది. అయితే, ఈ సంభాషణ అరుణ గ్రహం మీద జరగలేదు, ట్విట్టర్లో జరిగింది. భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన 'మామ్', అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా ప్రయోగించిన 'మావెన్' లు అంగారక గ్రహం కక్ష్యలోకి చేరుకున్నాయి. అవి చెప్పే విశేషాలను పంచుకునేదుకు శాస్త్రవేత్తలు ఉపగ్రహాల పేరిట ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ చేశారు. రెండు ఉప్రగహాలు అంగారకగ్రహ కక్ష్యలో ప్రవేశించిన తరువాత పంపే విశేషాలను ఈ అకౌంట్ల ద్వారానే శాస్త్రవేత్తలు వెల్లడించనున్నారు. దీంతో, రెండు ఉప గ్రహాలు పలకరించుకున్నట్టు ట్వీట్లు పోస్ట్ చేశారు. 'మామ్' అకౌంట్ ప్రారంభం కాగానే 22 వేల మంది ఫాలోవర్స్ ను చేర్చుకుంది. అంగారక గ్రహంపైకి చేరుకున్న 'మామ్', ఇప్పటికే అక్కడున్న 'క్యూరియాసిటీ రోవర్', 'మావెన్' ముచ్చటగా ట్వీట్లు చేసుకుంటూ అలరిస్తున్నాయి. "ఉండు సూర్యుడొచ్చాడు... కాస్త బ్రేక్ ఫాస్ట్ చేస్తా.. లేకపోతే బ్యాటరీకి ఆకలేస్తుంది" అంటూ ట్వీట్లతో సందడి చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News