: తెలంగాణ రాష్ట్ర దూరదర్శన్ చానల్ పేరు 'యాదగిరి'
తెలంగాణ ప్రాంతీయ దూరదర్శన్ ఛానల్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేశారు. రాష్ట్ర దూరదర్శన్ ఛానెల్ కు 'యాదగిరి' అనే పేరును ఆయన ఖరారు చేశారు. సెప్టెంబర్ 27 నుంచి దూరదర్శన్ 'యాదగిరి' ప్రసారాలు లాంఛనంగా ప్రారంభం అవుతాయి. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలకు దూరదర్శన్ 'యాదగిరి' చానల్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా 'యాదగిరి' చానల్ నిలవాలని కేసీఆర్ పేర్కొన్నారు.