: మెట్రో ప్రాజెక్టును విజయవాడకే పరిమితం చేయడం సరికాదు: నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ లో తొలుత మొదలు పెట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టుపై మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఒక్క విజయవాడ నగరానికే ప్రాజెక్టును పరిమితం చేయొద్దని కోరారు. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు తెనాలి, మంగళగిరి పట్టణాలను కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మిస్తే మంచి రాజధాని ఏర్పడుతుందని సూచించారు. ఇటీవల మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం సలహాదారు శ్రీధరన్ ఏపీలో పర్యటించారు. ప్రాజెక్టుకు విజయవాడను ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు. దానిపైనే మాట్లాడిన నాదెండ్ల, మెట్రో ప్రాజెక్టును ఓ నగరానికే పరిమితం చేయడం సబబు కాదన్నారు. పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ లో 12వ ప్రతిపాదనగా వీజీటీఎం పరిధిలో ప్రాజెక్టు నిర్మించాల్సి ఉందని గుర్తు చేశారు. వాటిని పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు.