: ఆసియా క్రీడల్లో భారత షట్లర్ల శుభారంభం
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ లో సైనా, సింధు సునాయాసంగా తొలి రౌండ్ అధిగమించగా... మహిళల డబుల్స్ లో ప్రద్న్య, సిక్కిరెడ్డి, పురుషుల డబుల్స్ లో సుమీత్ రెడ్డి, మను అత్రి కూడా ముందంజ వేశారు. సైనా 21-10, 21-8తో టెంగ్ అయోక్ (మకావు)పై నెగ్గగా, సింధు 21-17, 21-13తో కిట్ లెంగ్ వాంగ్ (మకావు)పై గెలిచింది. ఇక, ప్రద్న్య, సిక్కిరెడ్డి జోడీ 21-16, 21-4తో నేపాల్ జోడీ సిచ్యా శ్రేష్ట, పూనం గురుంగ్ పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ లో సుమీత్, అత్రి 21-7, 21-7తో మాల్దీవులకు చెందిన నషీవు షరాఫుద్దీన్, మహ్మద్ సరీమ్ పై నెగ్గింది.