: క్లింటన్ కుమార్తెకు తన వాహనశ్రేణిని ఆఫర్ చేసిన ఒబామా
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ నిండు గర్భవతి. ప్రసవానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమెకు తన అధికారిక వాహనశ్రేణిని ఆఫర్ చేశారు. అమె డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరే క్రమంలో... న్యూయార్క్ ట్రాఫిక్ లో ఆలస్యం కాకుండా ఉండేందుకే ఆయన ఈ ఆఫర్ చేశారు. తన అధికారిక వాహనాలైతే, ఎక్కడా అడ్డంకుల్లేకుండా ముందుకు వెళతాయన్నది ఒబామా ఆలోచన. అమెరికా అధ్యక్షుడి వాహనశ్రేణిలో రెండు ఆయుధ సహిత లిమోసిన్ కార్లు, సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వాహనాలు, ఇతర భద్రత సిబ్బంది వాహనాలు, అధికారుల కోసం మినీ బస్సులు, మీడియా వాహనం, అంబులెన్స్ ఉంటాయి.