: విషపు మొక్కలు... ఇప్పుడు మావోయిస్టుల ఆయుధాలు ఇవే!
బీహార్లో మావోయిస్టులు నయా రణతంత్రానికి తెరదీశారు. బుల్లెట్లు, పేలుడు పదార్థాలు ఖర్చు కాకుండా పోలీసు బలగాలను బలిగొనడంపై వారు దృష్టి సారించారు. అడవిలో పెరిగే కొన్ని రకాల మొక్కల నుంచి విషపు పదార్థాలను సేకరించి వాటి సాయంతో ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఆ విషాలను నిమ్మరసంతో కలిపి భద్రత బలగాలను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నది ఇంటలిజెన్స్ నివేదికల సారాంశం. అందుకే, అడవుల్లో కూంబింగ్ కు వెళ్ళే సిబ్బంది కొత్త ప్రదేశాల్లో అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు స్వీకరించరాదని అధికారులు ఆదేశాలు జారీచేశారు. అంతేగాకుండా, పోలీసు మెస్సుల్లో వంట సరుకులు కొనుగోలు చేసే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.