: మామ్ గ్రాండ్ సక్సెస్ తర్వాత... ఇస్రో తదుపరి టార్గెట్ ఏంటో తెలుసా?
తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహంపైకి మామ్ ఉప్రగ్రహాన్ని పంపి భారత్ చారిత్రక విజయాన్ని సాధించింది. ఈ విజయం ఇచ్చిన విశ్వాసంతో ఇస్రో స్పేస్ రీసెర్చ్ లో తన అడుగులను మరింత వడివడిగా వేయాలని భావిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇస్రో ఈ విజయం తర్వాత తన తదుపరి లక్ష్యాన్ని ఇప్పటికే సెట్ చేసుకుంది. విశ్వాంతరాల్లోకి మానవులను పంపి విశ్వంపై విస్తృతమైన పరిశోధనలు చేయించాలని ఇస్రో తన తదుపరి లక్ష్యంగా ఎంచుకుంది.