: హైవేపై కారులో వెళుతున్న ముగ్గుర్ని కాల్చి చంపారు
హైవేపై విజయవాడ నుంచి ఏలూరుకు కారులో వెళుతున్న ముగ్గురిపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటుపల్లి వద్ద జరిగింది. ఓ సిద్ధాంతితో పాటు మరో ఇద్దరు యువకులు కారులో వెళుతుండగా... బైక్ పై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. మృతి చెందిన వారు ప్రయాణిస్తున్న వాహనం... ఎస్వీఎస్ ట్రావెల్స్ కు చెందిన AP 20 AY 0500 కారుగా గుర్తించారు. విజయవాడ కమిషనర్ వెంకటేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటన అనంతరం కారు డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంలో 5 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.