: ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనల వెల్లువ
మంగళ్ యాన్ (మామ్) ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశంలోని పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. శాస్త్రవేత్తల కృషి, పట్టుదలతో భారతదేశ ప్రతిష్ఠ మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన వారిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, సదానందగౌడ తదితరులు ఉన్నారు.