: ఆన్ లైన్ ట్రేడింగ్ లో ‘ఈద్’ మేకలు!


ఈ-కామర్స్ దూసుకెళుతున్న క్రమంలో ఆన్ లైన్ విక్రయాలకు కాదేదీ అనర్హం అన్న చందంగా తయారైంది పరిస్థితి. తాజాగా మేకల విక్రయం కూడా ఆన్ లైన్ పోర్టళ్లకెక్కేసింది. ఈద్ సందర్భంగా భారీ డిమాండ్ నేపథ్యంలో ఈ కొత్త విక్రయం స్వల్ప కాలికమే అయినా, భవిష్యత్తులో సంతలా జరిగే మేకల విక్రయాలు కనుమరుగు కాక తప్పదన్న భావన వినిపిస్తోంది. ఈద్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లింలు మేకలను కొనుగోలు చేస్తుంటారు. దీంతో మేకల విక్రయాల సందర్భంగా కోలాహలంతో పాటు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అంతేకాక అనుకున్న రేటుకు కోరుకున్న మేక లభించే పరిస్థితి కూడా లేదు. దీనిని గమనించిన మేకల విక్రయదారులు ఆన్ లైన్ ను ఆశ్రయించారు. బీహార్ లోని భాగల్పూర్, సమస్తిపూర్, శివాన్, దర్భంగా, ఆరా, ముజఫర్ పూర్ తదితర ప్రాంతాలకు చెందిన మేకల వ్యాపారులు ఓఎల్ఎక్స్ పోర్టల్ లో మేకల విక్రయాలు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వెబ్ సైట్ లో మేక ఫొటోతో పాటు దాని ధర, విశిష్టత తదితరాలను పోస్ట్ చేయనున్నారు. దీంతో తమకే కాక కొనుగోలు దారులకు కూడా మరింత వెసులుబాటు లభించినట్లేనని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News