: ఇకపై పార్లమెంటులో హైదరాబాద్ బిర్యానీ


ఇకపై పార్లమెంటులోని అన్ని క్యాంటీన్లలో హైదరాబాదీ రుచులు సందడి చేయనున్నాయి. పార్లమెంటు సభ్యులు హైదరాబాద్ బిర్యానీతో పాటు ఇరానీ చాయ్ ను రుచి చూడనున్నారు. వీటితో పాటు మిర్చీకా సాలన్, షాహి తుక్డా, కుర్బానీ కా మీఠా తదితర వంటకాలు కూడా మెనూలో చేరనున్నాయి. ఈ వివరాలను టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి వెల్లడించారు. పార్లమెంట్ హౌస్ ఫుడ్ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ గా ఆయన నిన్న బాధ్యతలను స్వీకరించారు.

  • Loading...

More Telugu News