: అరుణగ్రహ గురుత్వాకర్షణలోకి చేరుకున్న మామ్
మామ్ ఉపగ్రహం అంగారక గ్రహ గురుత్వాకర్షణలోకి చేరుకుంది. కీలకమైన లామ్ ఇంజిన్లను మండించడం ద్వారా మామ్ ను మార్స్ గురుత్వాకర్షణలోకి వెళ్లేలా శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. నిర్దేశిత 24 నిమిషాల పాటు ద్రవ ఇంజిన్లు మండాయి. దీంతో, సెకనుకు 22.1 కిలోమీటర్ల వేగం నుంచి క్రమక్రమంగా మామ్ వేగం తగ్గేలా చేశారు. ప్రస్తుతం మామ్ గ్రహణ స్థితిని దాటింది.