: 20 లక్షల మందికి ఆరోగ్య కార్డులు జారీ: కామినేని


ఆంధ్రప్రదేశ్ లోని 20 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులకు ఆరోగ్యకార్డుల జారీ చేయాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించినట్టు ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీ ఉద్యోగులు కోరినట్టే ఆరోగ్యకార్డులు అందజేయనున్నామన్నారు. ఈ ఆరోగ్య కార్డులతో ఏపీలోని 470 ఆసుపత్రుల్లో ఎక్కడైనా వైద్యసదుపాయం పొందే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అక్టోబర్ రెండో వారానికల్లా వీటిని జారీ చేస్తామన్నారు. నవంబర్ 1 నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య సేవల్లో భాగంగా ఇవి అందుబాటులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News