: నాకు ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక లేదు!: ఉద్దవ్ ఠాక్రే
తనకు ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక లేదని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, వర్కారీ సమాజం తనను కలిసిందని, వారి మద్దతు తమకే ఉంటుందని తెలిపారని అన్నారు. ప్రజలు చూపించే ఆప్యాయత తనకు చాలని, తాను ముఖ్యమంత్రి పీఠమెక్కాలని ఆశించడం లేదని ఆయన తెలిపారు. నేటి ముఖ్యమంత్రులకు తెలిసిందల్లా ఏరియల్ సర్వే, యాత్రల్లో పాల్గోవడం అని ఆయన ఎద్దేవా చేశారు. ఓపక్క తమ కుర్చీని కాపాడుకునేందుకు ప్రార్ధనలు చేస్తూ, మరోపక్క ప్రజల కోసం ప్రార్థనలు నిర్వహించామని నేటి ముఖ్యమంత్రులు పేర్కొంటారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు మాత్రం వారికి తెలియవని ఆయన మండిపడ్డారు.